DailyDose

ఎస్‌బీఐలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఎస్‌బీఐలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో కొలువుల సందడి మొదలైంది. దేశ వ్యాప్తంగా వివిధ సర్కిళ్లలో భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియను SBI ప్రారంభించింది. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేటి(నవంబర్ 17) నుంచి డిసెంబర్‌ 7వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. మొత్తంగా 8,773 (రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ ఖాళీలు కలిపి) జూనియర్‌ అసోసియేట్‌ (కస్టమర్‌ సపోర్ట్‌ & సేల్స్‌) ఉద్యోగాలను భర్తీ చేస్తుండగా.. వీటిలో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 600 ఖాళీలు ఉన్నాయి. ప్రిలిమినరీ, మెయిన్‌ ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌తో పాటు స్థానిక భాష పరీక్ష ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేయనున్నారు.

నోటిఫికేషన్‌లో 10 కీలక పాయింట్లివే..

విద్యార్హతలు: అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ ఫైనల్‌/ చివరి సెమిస్టర్‌ వారూ అర్హులే.
వయో పరిమితి: 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. (2023 ఏప్రిల్‌ 1 నాటికి). రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపు ఉంది.

పరీక్ష ఆన్‌లైన్‌లో ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష జనవరిలో, మెయిన్‌ పరీక్ష ఫిబ్రవరిలో ఉండొచ్చు. ఈ పరీక్ష ఇంగ్లీష్‌, హిందీతో పాటు స్థానిక భాషల్లోనూ నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరీక్ష తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ, ఉర్దూ భాషల్లో రాయొచ్చు.

ప్రిలిమినరీ పరీక్ష 100 మార్కులకు; మెయిన్‌ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు.

బేసిక్‌ వేతనం: రూ. 19,900 నుంచి మొదలు..

ఎంపికైన అభ్యర్థులకు 6 మాసాల పాటు ప్రొబేషన్‌ ఉంటుంది.

ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/ఎక్స్‌సర్వీస్‌మెన్‌/మత సంబంధిత మైనారిటీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో ప్రీ ఎగ్జామినేషన్‌ ట్రైనింగ్‌ ఇస్తారు. ఇందుకోసం దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుం: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్‌సర్వీస్‌మెన్‌/దివ్యాంగ ఎక్స్‌సర్వీస్‌మెన్‌ కేటగిరీ అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుం చెల్లించనవసరం లేదు. జనరల్‌/ ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు మాత్రం రూ.750 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు పూర్తి చేయడం, ఫీజు చెల్లింపు తదితర ఇబ్బందులేవైనా వస్తే 022 22820427 నంబర్‌ను కాంటాక్టు చేయొచ్చు. బ్యాంకు పనివేళల్లో ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు కాంటాక్టు చేయొచ్చు.

ఏవైనా సందేహాలుంటే http://cgrs.ibps.inలోనూ ఫిర్యాదు చేయవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలివే.. అనంతపురం, భీమవరం, చీరాల, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమండ్రి, రాజంపేట, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం; తెలంగాణలో హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్గొండ, వరంగల్‌.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z