ScienceAndTech

భూవాతావరణంలోకి ప్రవేశించిన చంద్రయాన్-3

భూవాతావరణంలోకి ప్రవేశించిన చంద్రయాన్-3

శ్రీహరికోట నుంచి జులై 14న చంద్రయాన్‌-3 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లిన ఎల్‌వీఎం3-ఎం4 వాహకనౌక పైభాగం గురువారం మధ్యాహ్నం భూ వాతావరణంలోకి ప్రవేశించింది. ఇది ఉత్తర పసిఫిక్‌ మహాసముద్రంలో పడిపోతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రయోగం జరిగిన 124 రోజుల తరువాత ఈ భాగం భూ వాతావరణంలోకి తిరిగి వచ్చేలా ఇస్రో వ్యవస్థను రూపొందించింది. అంతరిక్షంలో వ్యర్థాలు, ప్రమాదాల తీవ్రతను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. అంతరిక్ష ప్రయోజనాలను కాపాడటంలో భారత్‌కు ఉన్న నిబద్ధతను ఈ ప్రక్రియ చాటుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z