Movies

మా ఇద్దరిదీ ముక్కుసూటితనం

మా ఇద్దరిదీ ముక్కుసూటితనం

‘జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ది.. నాదీ ఒకే మనస్తత్వం. ముక్కుసూటిగా మాట్లాడటం, అవినీతికి పాల్పడిన వారిని నిలదీయడం’అని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో గురువారం నిర్వహించిన తెదేపా, జనసేన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. జనసేన పార్టీతో కలవటం నవశకానికి నాంది అని పేర్కొన్నారు. కలసికట్టుగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని విమర్శించారు. అనంతరం హిందూపురం ప్రభుత్వాసుపత్రిని సందర్శించి, రోగులకు అందుతున్న వైద్యసేవలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సీటీస్కాన్‌ పనిచేయకపోవటం, గైనకాలజిస్టులు 9 మందికి ముగ్గురే ఉండటం, తాను అందించిన వెంటిలేటర్లు వినియోగించకపోవటం, ఆసుపత్రి అపరిశుభ్రంగా ఉండటంపై బాలకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం తెదేపా పాలనలో రూ.23 కోట్లతో నిర్మించిన బసవతారకరామ మాతాశిశు ఆసుపత్రి వద్ద సెల్ఫీ తీసుకొని వైకాపా ప్రభుత్వానికి ఛాలెంజ్‌ విసిరారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z