పార్శ్వపు నొప్పి (మైగ్రేన్) నివారణకు ఔషధ రహిత పరిష్కారాన్ని ఫార్మా రంగ సంస్థ డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ తీసుకువచ్చింది. నెరివియో పేరుతో చేతికి ధరించే పరికరాన్ని ప్రవేశపెట్టింది. యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి ఉందని, 12 ఏళ్లు, ఆపై వయసున్న వారు వైద్యుల సిఫార్సు మేరకు దీన్ని వాడొచ్చని కంపెనీ గురువారం ప్రకటించింది. తలనొప్పి ప్రారంభమైన 60 నిమిషాలలోపు వాడాలి. లేదా పార్శ్వపు నొప్పి నివారణకు ప్రతి రెండు రోజులకు ఒకసారి ఉపయోగించాల్సి ఉంటుంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z