కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల కోసమే పోరాటం చేస్తోందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. కుత్బుల్లాపూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో మల్లికార్జున ఖర్గే ప్రసంగించారు.
‘‘భాజపా, భారాసతో కాంగ్రెస్ పోరాటం చేస్తోంది. తెలంగాణలో భాజపా పోటీలో లేకుండా పోయింది. ఎక్కడా కనిపించడం లేదు. కేసీఆర్‌కు సహకరించేందుకే భాజపా పోటీ నుంచి వైదొలిగింది. భాజపా, భారాస కలిసే తెలంగాణలో పోటీ చేస్తున్నాయి. వాటి మధ్య రహస్య ఒప్పందం ఉంది. కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఈ రెండు పార్టీలు శ్రమిస్తున్నాయి. అవి ఎంత ప్రయత్నించినా కాంగ్రెస్ పార్టీ భయపడేది లేదు. అందరి భవిష్యత్‌ను రాసే గొప్ప బాధ్యతను అంబేడ్కర్ ఆనాడు నెహ్రూకు అప్పగించారు. ప్రజలందరి పోరాటం చూసి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. ఒక్క కుటుంబం కోసం సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వలేదు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని సోనియా తెలంగాణ ఇచ్చారు. కానీ, అవి నెరవేరలేదు’’ అని ఖర్గే అన్నారు.
👉 – Please join our whatsapp channel here –