నీటి సంక్షోభం నుంచి చెన్నపట్నం ఇంకా బయటపడలేదు. గత మూడు నెలలుగా అక్కడ తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. దీంతో చెన్నపట్నం దాహార్తిని తీర్చేందుకు పొరుగున ఉన్న కేరళ కూడా ముందుకు వచ్చింది. అయినప్పటికీ పరిస్థితి మెరుగు పడకపోవడంతో రైలు వ్యాగన్ల ద్వారా అక్కడికి నీటిని పంపుతున్నారు. వేలూరు జిల్లా జోలార్ పేట నుంచి చెన్నైకి వ్యాగన్లతో నీటిని తరలిస్తున్నారు. 2.5 మిలియన్ల లీటర్ల నీటిని ఈ రైళ్లు తీసుకెళుతున్నాయి. మొదటి రైలు విల్లివక్కమ్ రైల్వే స్టేషన్లో ఆగుతుంది. ఈ నీటిని సరఫరా చేసేపటప్పుడు తొక్కిసలాట జరగకుండా పోలీసు భద్రతను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో ట్రిప్పునకు రూ.7.5లక్షలు చెన్నై మెట్రో..దక్షిణ మధ్య రైల్వేకు చెల్లిస్తుంది. ఇందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వం రూ.65కోట్లు కేటాయించింది. చెన్నైకి రోజులో 10 మిలియన్ లీటర్ల నీటి అవసరం ఉంటుంది. ఈ రైళ్లు నీటిని సరఫరా చేసినప్పటికీ సగం మందికి మాత్రమే దాహార్తి తీరుతుంది. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం..జోలార్ పేట నుంచి చెన్నై విల్లివక్కం చేరుకోవడానికి ఐదు గంటలు పడుతుంది. అక్కడ ఉన్న కిల్పాక్ వాటర్ వర్క్స్ అనే సంస్థ ఈ నీటిని ప్రజలకు చేరవేస్తుంది.
చెన్నైలో తారాస్థాయికి చేరిన దాహపు కేకలు
Related tags :