Politics

అసెంబ్లీ నియోజకవర్గ ఓటరు జాబితాలో సరిగమపదనిసలు

అసెంబ్లీ నియోజకవర్గ ఓటరు జాబితాలో సరిగమపదనిసలు

కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఓటరు జాబితాలో సరిగమపదనిసలు కనిపిస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో ఈ విచిత్రం చోటుచేసుకుంది. జొహరాపురంలోని 257 బూత్‌లో 34/205-ఏ ఇంటి చిరునామాతో ఓ మహిళ పేరు ‘గగగగగగ’, భర్త పేరు ‘పపపపపప’గా నమోదైంది. అదే చిరునామాతో మరో ఓటరు పేరు, తండ్రి పేరు ‘దదదదదద’గా నమోదైంది. దీంతో పాటు అదే బూత్‌లోని 69/706-16 ఇంటి చిరునామాతో ఇంకో మహిళ పేరు ‘పప’, తండ్రి పేరు ‘ప’గా, 69/706/సీ49 ఇంటి చిరునామాతో మరో మహిళ పేరు అర్థంకాని భాషలో నమోదైంది. ఇలా ఓటరు జాబితాలో పేర్లు తప్పుగా నమోదవడంపై విమర్శలు వస్తున్నాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z