Business

హైదరాబాద్‌లో 2వ జాతీయ సుగంధ ద్రవ్యాల సదస్సు

హైదరాబాద్‌లో 2వ జాతీయ సుగంధ ద్రవ్యాల సదస్సు

2023 ఆల్ ఇండియా స్పైసెస్ ఎక్స్‌పోర్టర్స్ ఫోరం (AISEF) వరల్డ్ స్పైస్ ఆర్గనైజేషన్ (WSO), 2వ ఎడిషన్ నేషనల్ స్పైసెస్ కాన్ఫరెన్స్ 2023 మొదటి రోజును విజయవంతంగా ముగించింది. ఈ సదస్సులో నిపుణులు, పరిశ్రమ నాయకులు సుగంధ ద్రవ్యాల భద్రత, స్థిరత్వానికి సంబంధించిన కీలకమైన సమస్యలపై చర్చించారు.

ఈ సదస్సులో పాల్గొనేవారికి ఆత్మీయ స్వాగతం పలికిన వరల్డ్ స్పైస్ ఆర్గనైజేషన్ ఛైర్మన్ ‘రామ్‌కుమార్ మీనన్’ మాట్లాడుతూ.. సుగంధ ద్రవ్య పరిశ్రమ భద్రత దాని స్థిరత్వాన్ని నిర్ధారించడంలో సామూహిక ప్రయత్నాల ప్రాముఖ్యతను గురించి వ్యాఖ్యానించారు. సుగంధ ద్రవ్యాల భద్రత కేవలం బాధ్యత మాత్రమే కాదు, స్థిరమైన భవిష్యత్తును నిర్మించటానికి చూపాల్సిన నిబద్ధత అని వెల్లడించారు. ఈ పరిశ్రమలో ప్రతి ఒక్కరికీ మంచి స్థిరమైన ఆదాయానికి అవకాశాలు వున్నాయని చెప్పారు.

వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ అఫ్ అరేకనట్ అండ్ స్పైస్ డెవలప్‌మెంట్ (DASD) డైరెక్టర్ డాక్టర్ హోమి చెరియన్, మాట్లాడుతూ.. ఆర్థిక వృద్ధికి సుగంధ ద్రవ్యాలు ఉత్తమమైన మార్గం, స్థిరమైన వృద్ధి, ఆహార భద్రతకు ప్రాధాన్యతనిచ్చే ఈ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం కూడా కృషి చేస్తోందన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z