DailyDose

విశాఖలో అగ్ని ప్రమాదం

విశాఖలో అగ్ని ప్రమాదం

విశాఖపట్నంంలోని ఫిషింగ్‌ హార్బర్‌లో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి ఓ బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో 30కి పైగా బోట్లు కాలిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు .ఇక, సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ అగ్నిప్రమాదంలో 40కి పైగా బోట్లు కాలిపోయాయని స్థానికులు చెబుతున్నారు. ఎగిసిపడుతున్న మంటలను అధికారులు మెరైన్ బోట్లు ద్వారా అదుపులోకి తెచ్చారు. బోట్లలో నిద్రిస్తున్న వారు మంటల్లో చిక్కుకుని ఉన్నారేమో అని కార్మికులు తొలుత అనుమానించారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక, ఇది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే చేశారని స్థానికులు అనుమానిస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా బోట్ల యజమానులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z