ఎనిమిది అంటే ఎనిమిది గంటల వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్.. 500 వెబ్ సైట్స్ లేదా యాప్స్.. 70 వేల కోట్ల రూపాయల బెట్టింగ్స్.. ఇదీ క్రికెట్ ఫీవర్ అంటే.. బాల్ బాల్ కు బెట్టింగ్ జరిగింది. మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు.. ఫ్యాన్స్ ఉత్కంఠగా టీవలకు అతుక్కుపోతే.. బెట్టింగ్ రాయుళ్లు మాత్రం వాళ్ల వాళ్ల వ్యాపారంలో బిజీగా ఉన్నారు. ఓవరాల్ గా ఎనిమిది గంటల మ్యాచ్ లో జరిగిన క్రికెట్ బెట్టింగ్ ఎంతో తెలుసా.. అక్షరాల 70 వేల కోట్ల రూపాయలు అని.. ఓ బుకీ వెల్లడించటం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఇండియా గెలుపుపై 45 నుంచి 50 పైసలు ఉంటే.. ఆస్ట్రేలియా విజయంపై 55 నుంచి 60 పైసలుగా ట్రేడ్ అయ్యింది. ఇండియా గెలుస్తుందని ఓ పందెంరాయుడు లక్ష రూపాయలు బెట్ కాస్తే.. అతనికి వచ్చింది 45 నుంచి 50 వేల రూపాయలు మాత్రమే. ఆస్ట్రేలియాపై గెలుస్తుందని పందెం కాసిన వ్యక్తికి.. ఇదే లక్ష రూపాయలకు లక్షా 55 వేల రూపాయల వరకు వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సమయంలో 600 బెట్టింగ్ వెబ్ సైట్స్, 400 యాప్స్ యాక్టివ్ గా పని చేశాయని.. కనీసంలో కనీసం వంద రూపాయల నుంచి బెట్ స్టార్ట్ అయ్యిందని ఓ బుకీ వెల్లడించటం విశేషం. టాస్ గెలుపోటముల నుంచి బ్యాటర్లు, బౌలర్లపైనా, ఫోర్లు, సిక్సులపైనా బెట్టింగ్ జరిగింది.
మ్యాచ్ ప్రారంభం అయినప్పుడు ఇండియా గెలుస్తుందని ఎక్కువ మంది బెట్ కాశారని.. 240 పరుగులకు ఆలౌట్ అయిన వెంటనే.. ఆస్ట్రేలియా వైపు బెట్టింగ్ బాగా జరిగినట్లు చెప్పుకొచ్చాడు ఆ బుకీ. చివరి బాల్ వరకు బెట్టింగ్ కొనసాగిందని.. ఈసారి 70 శాతం బెట్టింగ్స్ ఆన్ లైన్ ద్వారానే జరిగిందని.. పోలీస్ దాడులు, నిఘాతో బుకీల దగ్గర సందడి తగ్గిందని వెల్లడించాడు. ఆ జాతీయ పత్రికకు బుకీ వెల్లడించిన వివరాలే ఇవీ..
👉 – Please join our whatsapp channel here –