అమెరికా నౌకాదళానికి చెందిన ఓ భారీ నిఘా విమానం రన్‌వేపై అదుపు తప్పి ఏకంగా సముద్రంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో హవాయిలోని మెరైన్ కోర్ బేస్‌లో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని ఆ కోర్ ప్రతినిధి ఓర్లాండో ప్రెజ్ ప్రకటించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కోస్టు గార్డు సిబ్బంది స్పందించడంతో.. ఆ విమానంలోని సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.
అక్కడే సముద్రంలో బోటింగ్ చేస్తున్నవారు ఈ విమానం నీటిపై తేలడం చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ విజిబిలిటీ తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా నౌకాదళంలో పీ-8ఏ పొసెడాన్ విమానం అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. ఇది సబ్మెరైన్లను గాలించి వాటిపై దాడి చేయగలదు. అంతేకాదు.. భారీగా ఇంటెలిజెన్స్‌ను కూడా ఈ విమానం సేకరించగలదు. టోర్పెడోలు, క్రూజ్ క్షిపణులను కూడా ఇది తీసుకెళ్లగలదు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో వెల్లడించలేదు. ఈ విమానాన్ని నిర్వహించే పెట్రోల్ స్క్వాడ్రన్ కనోహె బే కేంద్రంగా పనిచేస్తుంది. మెరైన్ కోర్ ప్రధాన స్థావరం కూడా హవాయిలోనే ఉంది. ఇక ప్రపంచంలో పీ8 విమానాలను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్, నార్వే, భారత్ సైన్యాలు కూడా వాడుతున్నాయి.
2009లో అమెరికాలో ఓ భారీ విమానం హడ్సన్ నది మధ్యలో నీటిపై దిగింది. కానీ, పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో అప్పట్లో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
https://twitter.com/i/status/1726798820577824968
👉 – Please join our whatsapp channel here –