Fashion

వేపాకులతో ఆ సమస్యకు చెక్

వేపాకులతో ఆ సమస్యకు చెక్

బ్యూటీ టిప్స్‌:

* టీ స్పూన్‌ పచ్చిపాలలో అయిదారు చుక్కల తులసి రసం కలపాలి. ఈ మిశ్రమంలో కాటన్‌ ముంచి ముఖానికి, మెడకి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే మొటిమలు తగ్గి ముఖం పొడిబారకుండా ఉండి చర్మం నిగనిగలాడుతుంది.

* ఒక టేబుల్‌ స్పూన్‌ కోకో బటర్‌కి రెండు టేబుల్‌ స్పూన్ల రోజ్‌వాటర్‌ని కలిపి పేస్ట్‌లా చేయాలి. ఆ పేస్ట్‌ని ఫేస్‌కి ప్యాక్‌లా వేసుకుని పది నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో ఫేస్‌వాష్‌ చేసుకోవాలి.

* ముఖంపై మొటిమలు, మచ్చలతో బాధపడుతుంటే వేపాకులు బెస్ట్‌ సొల్యూషన్‌. వేపా​‍కుల పొడిలో పసుపు, రోజ్‌వాటర్‌ కలుపుకొని ముఖానికి అప్లై చేయాలి. ఆరిన తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా తరచూ చేస్తుంటే మొటిమల సమస్య తగ్గిపోతుంది.

* కొద్దిగా కాఫీ పౌడర్, కొబ్బరి నూనెను సమపాళ్లలో తీసుకొని అందులో ఒక చెంచా చక్కెర వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేయండి. ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడమే కాకుండా మృదువుగా మారుస్తుంది, చర్మం తాజాగా కనిపిస్తుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z