Business

ఎస్‌బీఐ నుంచి మరో నోటిఫికేషన్‌

ఎస్‌బీఐ నుంచి మరో నోటిఫికేషన్‌

దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐలో కొలువుల సందడి నెలకొంది. ఇప్పటికే 8వేలకు పైగా క్లర్కు ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోన్న ఎస్‌బీఐ.. తాజాగా మరో 5వేలకు పైగా ఆఫీసర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా ఎస్‌బీఐ సర్కిళ్లలో 5,280 సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ (సీబీవో) ఉద్యోగాల భర్తీకి అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు బుధవారం (నవంబర్‌ 22) నుంచి డిసెంబర్‌ 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌లో 10 కీలక అంశాలివే..

మొత్తం 5,280 సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌(CBO) ఉద్యోగాలను భర్తీ చేస్తుండగా.. వీటిలో తెలుగు రాష్ట్రాల్లో 825 ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన అర్హత తప్పనిసరి.

వయో పరిమితి: అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 ఏళ్లు మించరాదు (2023 అక్టోబర్‌ 31 నాటికి ). రిజర్వేషన్ల ఆధారంగా ఆయా వర్గాల వారికి వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.

ఏదైనా కమర్షియల్‌ బ్యాంకు లేదా రీజినల్‌ గ్రామీణ బ్యాంకులో రెండేళ్ల పాటు పనిచేసిన అనుభవం ఉండాలి.

వేతన స్కేలు: రూ. 36,000 – రూ. 63,840 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుం: జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ అభ్యర్థులకు రూ.750; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఎలాంటి రుసుం లేదు.

ఏ సర్కిల్‌లో దరఖాస్తు చేస్తున్నారో.. ఆ ప్రాంతానికి సంబంధించిన భాషలో చదవడం, రాయడం, అర్థం చేసుకొనే నైపుణ్యం కలిగి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్‌ టెస్ట్‌, స్క్రీనింగ్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ పరీక్ష్‌ ఆబ్జెక్టివ్‌ రూపంలో 120 మార్కులకు, డిస్క్రిప్టివ్‌ రూపంలో 50 మార్కులకు ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ పరీక్షకు సమయం 2గంటలు కాగా.. డిస్క్రిప్టివ్‌ పరీక్షను 30 నిమిషాల్లో రాయాల్సి ఉంటుంది. డిస్క్రిప్టివ్‌ పరీక్ష ఇంగ్లిష్ భాషలోనే రాయాల్సి ఉంటుంది. తప్పు సమాధానానికి నెగెటివ్‌ మార్కులు లేవు.

ఆన్‌లైన్‌ పరీక్ష 2024 జనవరిలో నిర్వహించే అవకాశం ఉంది. కచ్చితమైన తేదీలను తర్వాత ప్రకటిస్తారు.

ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆరు నెలల పాటు ప్రొబేషన్‌ ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలివే.. గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z