భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.. శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తికి రానున్నారు రాష్ట్రపతి.. నేడు సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ 42వ స్నాతకోత్సవం జరగనుంది.. సాయి హీరా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా వేడుకలు నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది సత్యసాయి డీమ్డ్ వర్సిటీ.. అయితే, ఆ స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు.. ఇక, ఈ కార్యక్రమానికి గవర్నరు అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు. 14 మందికి డాక్టరేట్లు, 21 మందికి బంగారు పతకాలు అందించనున్నారు.
సత్యసాయి జిల్లా పర్యటన కోసం రాష్ట్రపతి మధ్యాహ్నం ఒడిశాలో బయలుదేరి మధ్యాహ్నం 2.35 గంటలకు పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన 2.45 గంటలకు ప్రశాంతి నిలయం చేరుకోనున్నారు.. ఇక, 3.05 గంటలకు సాయి కుల్వంత్ మందిరంలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకోనున్నారు.. ఆ తర్వాత సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 42వ స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3.35 గంటలకు స్నాతకోత్సవంలో విద్యార్థులకు డాక్టరేట్లు, బంగారు పతకాలు అందజేయనున్నారు.. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆ తర్వాత సాయంత్రం 4.20 గంటలకు రోడ్డు మార్గాన సత్యసాయి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. ఇక, రాష్ట్రపతి, గవర్నర్ పర్యటన దృష్ట్యా భారీ ఏర్పాట్లు చేశారు అధికారలు.. 2 వేల మందితో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు.. కింది టేబుల్ లో చూడవచ్చు…
👉 – Please join our whatsapp channel here –