తన అందం, అభినయంతో వెండితెరపై అతిలోక సుందరిగా కోట్లాది మంది ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నటి శ్రీదేవి. గతేడాది దుబాయిలో జరిగిన ఓ వేడుకకు హాజరైన ఆమె.. ప్రమాదవశాత్తు స్నానం చేసే నీటి తొట్టెలో పడి మృతిచెందడం కోట్లాది మంది సినీ ప్రేమికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. శ్రీదేవి మృతిపై అప్పట్లో అనేక వూహాగానాలు విన్పించాయి. తాజాగా కేరళ జైళ్ల శాఖ మాజీ డీజీ రిషిరాజ్ సింగ్ ఓ దినపత్రికకు రాసిన వ్యాసంలో శ్రీదేవి మరణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవి మరణంలో కుట్రకోణం దాగి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఆమె మరణానికి సంబంధించిన విషయాలను ఫొరెన్సిక్ నిపుణుడైన తన స్నేహితుడు ఉమాదత్తన్ తనతో పంచుకున్నారని వ్యాసంలో పేర్కొన్నారు. ‘ఒక మనిషి ఎంత మద్యం మత్తులో ఉన్నప్పటికీ అడుగు లోతు ఉండే నీటితొట్టెలో పడి చనిపోవడం అసాధ్యం. ఎవరైనా శ్రీదేవి కాళ్లను గట్టిగా ఒత్తిపట్టి తలను నీటిలో ముంచి ఉంటారని.. అలా చేస్తే తప్ప ఆమె చనిపోయే అవకాశం లేదు’ అంటూ ఉమాదత్తన్ తనతో చెప్పినట్లు రిషిరాజ్ సింగ్ వివరించారు. అయితే ఉమాదత్తన్ ఇటీవలే మరణించినట్లు రిషిరాజ్ సింగ్ తెలిపారు. రిషిరాజ్ సింగ్ వ్యాఖ్యలపై శ్రీదేవి భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ స్పందించారు. ఇలాంటి మూర్ఖమైన వార్తల్ని ఎవరో ఒకరు పుట్టిస్తూనే ఉంటారని, అలాంటి వాటిపై స్పందించాల్సిన అవసరం తనకు లేదని కొట్టిపారేశారు. అవన్నీ ఊహజనితమైన కట్టు కథలేనన్నారు.
మీరనుకున్నది నిజమే! శ్రీదేవిని హత్య చేశారు.
Related tags :