Politics

కుటుంబ పాలన నుంచి తెలంగాణకూ విముక్తి కల్పిస్తాం!

కుటుంబ పాలన నుంచి తెలంగాణకూ విముక్తి కల్పిస్తాం!

అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను గెలిపిస్తే తెలంగాణ రూపురేఖలు మారిపోతాయని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయంగా మారిందని.. ఈ పదేళ్లలో ఆయన కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందిందన్నారు. నిజామాబాద్‌లో నిర్వహించిన సకల జనుల సంకల్ప సభలో నడ్డా మాట్లాడారు.

‘‘తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్‌ మోసం చేశారు. దళిత బంధులో ప్రజాప్రతినిధులు 30 శాతం కమీషన్‌ తీసుకుంటున్నారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనను తెలంగాణలో అమలు చేయడం లేదు. ప్రధాని మోదీ హయాంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ ఐదో స్థానానికి చేరింది. గరీబ్‌ కల్యాణ్‌ యోజన ద్వారా 80 కోట్ల మందికి ఉచిత రేషన్‌ పంపిణీ చేస్తున్నాం. కుటుంబ పాలన నుంచి పలు రాష్ట్రాలకు విముక్తి కల్పించాం. అదే మాదిరిగా కుటుంబ పాలన నుంచి తెలంగాణకూ విముక్తి కల్పిస్తాం’’ అని నడ్డా వెల్లడించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z