మహారాష్ట్రలోని ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయానికి (Mumbai Airport) బెదిరింపు మెయిల్ వచ్చింది. 48 గంటల్లోగా బిట్‌కాయిన్ రూపంలో 1 మిలియన్ డాలర్లు ఇవ్వకపోతే ఎయిర్‌పోర్ట్‌లోని టర్మినల్-2ని పేల్చివేస్తామంటూ ఆగంతకులు ఎయిర్పోర్ట్ ఫీడ్‌బ్యాక్ ఇన్‌బాక్స్‌కు గురువారం మెయిల్ పంపించారు. 24 గంటల తర్వాత మరో మెయిల్ పంపిస్తామని అందులో పేర్కొన్నారు. దీంతో విమానాశ్రయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి కూడా బెదింపు మెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. రూ. 20 కోట్లు ఇవ్వాలని లేదంటే ముకేశ్ అంబానీని అంతమొందిస్తామని ఓ వ్యక్తి రిలయన్స్ సంస్థకు మెయిల్ పంపించాడు. ఆ తర్వాత రూ. 200 కోట్లు, రూ. 400 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని తెలంగాణకు చెందిన 19 ఏళ్ల యువకుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు.
👉 – Please join our whatsapp channel here –