బ్రిటన్ వీసాలు పొందుతున్న వారిలో భారతీయులు అగ్రభాగాన ఉన్నారు. గత ఏడాది కాలంగా మన దేశానికి చెందిన నిపుణులైన ఉద్యోగులు, వైద్యులు, విద్యార్థులు ఆ దేశ వీసాలను అత్యధికంగా పొందుతున్నారు. సెప్టెంబరుతో ముగిసిన 2023 వార్షిక గణాంకాలను బ్రిటన్కు చెందిన జాతీయ గణాంకాల కార్యాలయం(ఓఎన్ఎస్) గురువారం వెల్లడించింది. నైపుణ్యం గల ఉద్యోగులు, వైద్య, ఆరోగ్య సంరక్షణ రంగానికి చెందిన వారికి మంజూరైన వీసాలు కిందటేడాది కంటే రెట్టింపు (135%) కావడంతో ఆ సంఖ్య 1,43,990కు చేరుకుందని వెల్లడించింది. వీరిలో భారతీయులు(38,866) అగ్రస్థానంలో, నైజీరియన్లు (26,715), జింబాబ్వేయన్లు(21,130) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 2023లో భారతీయ విద్యార్థులు 1,33,237 మందికి బ్రిటన్ వీసాలు మంజూరయ్యాయి. 2022 సెప్టెంబరుతో ముగిసిన ఏడాది కంటే 5,804(అయిదు శాతం) అధికం.
👉 – Please join our whatsapp channel here –