క్రెడిట్‌కార్డ్‌సహా వ్యక్తిగత రుణ మంజూరీలపై నిబందనలను కఠినతరం చేస్తూ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవల తీసుకున్న నిర్ణయం బ్యాంకులు, నాన్–బ్యాంకు ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ)ల రుణ వృద్ధికి విఘాతం కలిగిస్తుందని ఫిచ్ రేటింగ్స్ ఒక నివేదికలో పేర్కొంది.
ఇది బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరత్వానికి ఉద్దేశించిన ‘‘ముందస్తు’’ చర్యని బుధవారం గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. వ్యక్తిగత రుణ మంజూరీల విషయంలో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల రిస్క్ కేటాయింపులను 25 శాతం పెంచుతూ ఆర్‌బీఐ కీలక నిబంధనలు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.
సెప్టెంబర్ నాటికి వార్షికంగా ఈ రుణ విభాగం 30 శాతం పెరుగుదల దీనికి నేపథ్యం. ఆర్‌బీఐ నిర్ణయంతో బ్యాంకింగ్, ఎన్‌బీఎఫ్‌సీలు అన్‌సెక్యూర్డ్ వ్యక్తిగత రుణ మంజూరీల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. మూలధనంపై కూడా ఈ నిర్ణయ ప్రభావం ఉంటుందన్న విశ్లేషణలు ఉన్నాయి.
👉 – Please join our whatsapp channel here –