NRI-NRT

విశాఖలో వైభవంగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ 70వ జన్మదిన వేడుకలు – Gallery

విశాఖలో వైభవంగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ 70వ జన్మదిన వేడుకలు – Gallery

రాజ్యసభ మాజీ సభ్యులు, పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాల గ్రహీత, రెండు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాల గ్రహీత డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ 70వ జన్మదిన వేడుకలు విశాఖలోని వాల్తేరు క్లబ్‌లో శుక్రవారం నాడు వైభవోపేతంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా యార్లగడ్డతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పలువురు ప్రముఖులు అందజేసిన వీడియో సందేశాన్ని ప్రదర్శించారు. గ్రామీణ వాతావరణం నుండి వచ్చి స్నేహానికి గౌరవం ఇచ్చే వ్యక్తిగా, తెలుగు-హిందీ భాషలను సమానంగా ప్రేమించే సాహితీవేత్తగా, రాజకీయనాయకుడిగా లక్ష్మీప్రసాద్ జీవితం 70ఏళ్లు సంపూర్ణంగా సాగిందని, లక్ష్మీప్రసాద్-సౌజన్య దంపతులు ఆరోగ్యంగా మరింత కాలం భాషా సేవ చేయాలని ఆకాంక్షించారు. సందేశం పంపిన వారిలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ గోడ రఘురాం, లావు రత్తయ్య, మోహన్‌బాబు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం తదితరులు ఉన్నారు. గుమ్మడి గోపాలకృష్ణ ప్రదర్శించిన “శ్రీకృష్ణ రాయబార” ఘట్టం ఆకట్టుకుంది.

లోకనాయక్ ఫౌండేషన్‌కు యార్లగడ్డ కుటుంబ సభ్యులు ₹50లక్షలు ఫౌండేషన్ కార్యదర్శికి అందజేశారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తన తల్లిదండ్రులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు.

మాజీ ఉప-రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు, ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, విజయసాయిరెడ్డి, మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, మేరుగు నాగార్జున, విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిజీ, పాత్రికేయులు రామచంద్రమూర్తి, దర్శకుడు రాఘవేంద్రరావు, సినీనటులు నాగార్జున, అఖిల్, మాజీ ఎంపీలు కేవీపీ, ఉండవల్లి, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, కె.వి.సత్యనారాయణ, గుమ్మడి గోపాలకృష్ణ, హాస్యబ్రహ్మ శంకరనారాయణ, అడుసుమిల్లి తిరుమలేష్, సినీనటి రోజారమణి, యార్లగడ్డ శివరాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z



























విశాఖలో వైభవంగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ 70వ జన్మదిన వేడుకలు – Gallery