Movies

సక్రమమే సంతృప్తి

Rakul Preet Says Doing Right Is Satisfaction And It Shouldnt Stop

‘‘మన కలలు ఎంత విశాలంగా ఉంటాయో, మనం సాధించాలనుకునే అంశాలు కూడా అంతే గొప్పగా ఉంటాయి. అందుకే కలలు కనాలి. వాటి సాకారానికి కృషి చేయాలి’’ అని అన్నారు రకుల్ప్రీత్ సింగ్. ఆమె ప్రస్తుతం అక్కినేని నాగార్జున సరసన ‘మన్మథుడు2’లో నటిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడూ కలర్ఫుల్ పిక్చర్స్ పోస్ట్ చేసే రకుల్ మాట్లాడుతూ ‘‘ఎవరైనా సరే… అలా బిగుసుకుపోయి, స్టిఫ్గా ఉండకూడదు. మానసికంగానూ, భౌతికంగానూ ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అలాగే ఓ ధ్యేయంతో పనిచేస్తున్నంత సేపూ ఉత్సాహంగా ఉండాలి. మనం అలసిపోయామని చేస్తున్న పనిని సగంలో ఆపకూడదు. చేయాల్సిన పని పూర్తయినప్పుడు మాత్రమే వాటికి ఫుల్స్టాప్ పెట్టాలి. పనిని సక్రమంగా చేసినప్పుడు ఒక రకమైన ఆత్మసంతృప్తి కలుగుతుంది. ఆ వెలుగు మన కళ్లల్లో కనిపిస్తుంది’’ అని అన్నారు రకుల్ ప్రీత్ సింగ్.