తేలికగా, వర్ణరంజితంగా ఉంటాయి ఫ్యాన్సీ చీరలు. అలాంటివే ఇవి. ఎన్నెన్నో వర్ణాలు… మరెన్నో డిజైన్లలో ఆకట్టుకుంటూ… ముదితల హృదయాలను దోచేస్తున్న వీటిపై ఓ కన్నేయండి.
*లేత గోధుమ రంగు ఫ్యాన్సీ సిల్కు టిష్యూ చీరపై పరచుకున్న ఎంబ్రాయిడరీ పూలు, పైస్లీ మోటిఫ్‌లు… చీర అందాన్ని రెట్టింపు చేస్తున్న సన్నటి ఆకుపచ్చ అంచు… సొగసు వర్ణించతరమా!
*సముద్ర నీలంరంగు ఫ్యాన్సీ సిల్కు చీరపై రేషమ్ ఎంబ్రాయిడరీ, ముచ్చటైన మోటిఫ్‌లు… మామిడి పిందెలు, బంగారు వర్ణపు అంచు… కట్టుకుంటే ఆ అందమే వేరు.
*నలుపురంగు ఫ్యాన్సీ సిల్కు టిష్యూ చీరపై అద్దాలతో కూడిన ఎంబ్రాయిడరీ… పూసలు, పైస్లీ మోటిఫ్‌లు… బంగారు ఖాదీ అంచు చీరకు ప్రత్యేక అందాన్ని తెచ్చిపెట్టాయి. టాజిల్స్ కొంగు చూపు తిప్పనివ్వదు.
*లేత గోధుమ- బంగారు వర్ణంలో ఉన్న ఫ్యాన్సీ చీర… దానికి మెరుగులద్దే పసిడి అంచు… కొంగు, అంచు నిండా పరుచుకున్న పూల ఎంబ్రాయిడరీ డిజైను… చూస్తే వావ్ అనిపించడం ఖాయం.
ఫ్యాన్సీ ఎంబ్రాయడరీ చీరలు చాలా తేలిగ్గా ఉంటాయి
Related tags :