Devotional

సత్యనారాయణ స్వామి గిరిప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు

సత్యనారాయణ స్వామి గిరిప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు

కార్తిక పౌర్ణమి సందర్భంగా కాకినాడ జిల్లా అన్నవరంలో సత్యదేవుని గిరిప్రదక్షిణ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు కొండ దిగువల తొలి పావంచాల వద్ద స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గిరిప్రదక్షిణను ప్రారంభించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తుల కోలాహలం నడుమ గిరి ప్రదక్షిణ కొనసాగుతోంది. గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

గిరిప్రదక్షిణకు రత్న, సత్యగిరుల చుట్టూ సుమారు 8.5 కిలోమీటర్ల మేర మార్గాన్ని ఆలయ అధికారులు సిద్ధం చేశారు. అన్నవరం గ్రామంలోని జాతీయ రహదారి మీదుగా సుమారు 3.5 కిలోమీటర్లు తారురోడ్డు.. ఆ తర్వాత పోలవరం కాలువ గట్టు నుంచి పంపా ఘాట్‌ వరకు సుమారు 5 కిలోమీటర్లు మట్టిరోడ్డులో గిరిప్రదక్షిణ కొనసాగుతోంది. జాతీయ రహదారిపై ప్రదక్షిణ సాగే సమయంలో విశాఖ-రాజమహేంద్రవరం మార్గంలోనే వాహనాలు అనుమతిస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z