కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడంతోనే ‘రైతుబంధు’కు ఈసీ అనుమతి నిరాకరించిందని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. మహా అయితే డిసెంబర్ 3 వరకు రైతుబంధును కాంగ్రెస్ నేతలు ఆపగలరని.. ఆ తర్వాత మళ్లీ ఇచ్చేది కేసీఆరేనని చెప్పారు. జహీరాబాద్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో హరీశ్ మాట్లాడారు. రైతుబంధుపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేత నిరంజన్‌రెడ్డి ఫిర్యాదు చేశారన్నారు.
‘‘కాంగ్రెస్ వాళ్లు రైతులకు ఇవ్వరు.. ఇచ్చిన వాళ్లకు అడ్డుపడుతున్నారు. తెలంగాణ రైతులతో కేసీఆర్‌ది ఓటు బంధం కాదు.. పేగుబంధం. గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకపోయినా రైతుబంధు ఇచ్చాం. ఓట్ల కోసం కాకుండా రైతులపై ప్రేమతో 11 సార్లు కేసీఆర్ ఇచ్చారు. ఎకరాకు రూ.16వేల ఇస్తానని కేసీఆర్ అంటే.. రైతుకు ఏడాదికి రూ.15వేలు ఇస్తామని కాంగ్రెస్ చెబుతోంది. కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి. వారికి ఓటుతోనే పోటు పొడవాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుబంధు నిలిచిపోతుంది. కర్ణాటకలో ఆ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. ఇచ్చిన హామీలను అమలు చేసేది కేసీఆర్’’ అని హరీశ్‌రావు అన్నారు.
👉 – Please join our whatsapp channel here –