పీనట్ ఐస్‌క్రీమ్ తయారీకి కావల్సినవి:
స్వీటెండ్ కండెన్సడ్ మిల్క్ – 400 గ్రాములు
హెవీ క్రీమ్ – 480 ఎమ్‌ఎల్,పీనట్ బటర్ – 250గ్రాములు
వేరుశనగలు – 70 గ్రాములు (దోరగా వేయించి, తొక్క తీసి, కచ్చాబిచ్చా చేసుకోవాలి)
తయారీ విధానమిలా:
ముందుగా ఒక పెద్ద గిన్నెలో హెవీ క్రీమ్ వేసుకుని హ్యాండ్‌హెల్డ్ మిక్సర్‌తో బాగా నురుగు వచ్చేలా, క్రీమీగా చేసుకోవాలి. దానిలో కండెన్సడ్ మిల్క్, పీనట్ బటర్ వేసుకుని.. బాగా కలుపుకోవాలి. మెత్తగా క్రీమీగా మారిన తర్వాత.. దానిలో కచ్చాబిచ్చా చేసుకున్న వేరుశనగ ముక్కల్ని కలుపుకోవాలి. అనంతరం ఆ మొత్తం మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని.. సమాంతరంగా చేసుకోవాలి. 6 గంటలు పాటు ఫ్రిజ్‌లో పెట్టుకుని.. ఆ తర్వాత సర్వ్ చేసుకోవాలి.
👉 – Please join our whatsapp channel here –