వారసులను పదవుల్లో కూర్చోబెట్టాలని భారాస, కాంగ్రెస్ మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆరోపించారు. వారసుల పదవుల కోసం ఆ రెండు పార్టీలు పరస్పరం సహకరించుకుంటున్నాయని విమర్శించారు. హుజురాబాద్‌లో నిర్వహించిన భాజపా సకల జనుల విజయ సంకల్ప సభలో అమిత్ షా ప్రసంగించారు. భారాస అవినీతి పాలన నుంచి ప్రజలకు విముక్తి కలగాలని అన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈ ప్రభుత్వం నిర్వహించడం లేదని ఎద్దేవా చేశారు.
‘‘మజ్లిస్‌కు భయపడి 4శాతం ముస్లిం రిజర్వేషన్లు చేశారు. తెలంగాణకు మోదీ సర్కార్ రూ.7 లక్షల కోట్లు ఇచ్చింది. భాజపా గెలిస్తే.. రాష్ట్రానికి బీసీ వ్యక్తి తొలి సీఎం అవుతారు. భాజపాను గెలిపిస్తే.. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తాం. పేద మహిళలకు ఏడాదికి 4 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం’’ అని అమిత్ షా పునరుద్ఘాటించారు. తెలంగాణ అభివృద్ధి భాజపాతోనే సాధ్యమని చెప్పిన ఆయన.. హుజురాబాద్ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
👉 – Please join our whatsapp channel here –