Business

ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హులైన వారి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మొత్తం 995 అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌(ACIO) గ్రేడ్‌-2/ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిసెంబర్‌ 15లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌లో 10 ముఖ్యాంశాలివే..
విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి.
వయో పరిమితి: 18 నుంచి 27 ఏళ్లు మధ్య ఉండాలి. (ఆయా వర్గాల వారికి రిజర్వేషన్‌ ఆధారంగా వయో సడలింపు ఉంటుంది)

వేతనం: పే లెవెల్‌- 7 ప్రకారం.. నెలకు ప్రారంభ వేతనం కింద రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు చెల్లిస్తారు. దీనికి ఇతర సదుపాయాలు అదనం.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ సహా ఇతర పరీక్షల ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. రాత పరీక్ష టైర్‌ 1, టైర్‌ 2గా ఉంటుంది. టైర్‌- 3 పరీక్ష కింద ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, వైద్య పరీక్షలు/అభ్యర్థి ప్రవర్తనకు సంబంధించిన వెరిఫికేషన్‌ పూర్తి చేసి ఆధారంగా ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను ప్రకటిస్తారు.

నవంబర్‌ 25 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలైంది. డిసెంబర్‌ 15 రాత్రి 11.59గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. డిసెంబర్‌ 19వరకు ఎస్‌బీఐలో చలానా ద్వారా దరఖాస్తు రుసుం చెల్లించేందుకు అవకాశం ఉంది.

దరఖాస్తు రుసుం: పరీక్ష రుసుం రూ.100లు కాగా.. రిక్రూట్‌మెంట్‌ ప్రాసెసింగ్‌ రుసుం రూ.450 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

పరీక్ష ఆన్‌లైన్‌లో ఉంటుంది. టైర్‌- 1 పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. 100 ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ విధానంలో అడుగుతారు. గంట సమయం ఇస్తారు. ఈ పేపర్‌లో కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ స్టడీస్‌, న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌/లాజికల్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లీష్‌ సబ్జెక్టులపై ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు.

టైర్‌ – 2 పరీక్ష 50 మార్కులకు ఉంటుంది. ఇది పూర్తిగా డిస్క్రిప్టివ్‌ విధానంలోనే ఉంటుంది. వ్యాస రూప ప్రశ్నలకు 30 మార్కులు ఉండగా.. ఇంగ్లిష్‌ కాంప్రెహెన్షన్‌ తదితర ప్రశ్నలకు 20 మార్కులు చొప్పున ఇస్తారు. దీనికి కూడా గంట పాటు సమయం ఇస్తారు.

టైర్‌ -3 పరీక్షలో భాగంగా ఇంటర్వ్యూ ఉంటుంది. దీనికి 100 మార్కులు. సైకోమెట్రిక్‌/ఆప్టిట్యూడ్‌ పరీక్ష ఇందులోనే భాగంగా ఉండొచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలివే.. అనంతపురం, చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం; తెలంగాణలో హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, వరంగల్‌ అర్బన్‌. పరీక్ష కేంద్రానికి సంబంధించి అభ్యర్థి ఐదు సెంటర్లను ఎంపిక చేసుకోవచ్చు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z