Politics

ఉద్యోగాల కోసం తెలంగాణ తెచ్చుకుంటే అదీ నెరవేరలేదు!

ఉద్యోగాల కోసం తెలంగాణ తెచ్చుకుంటే అదీ నెరవేరలేదు!

రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) అన్నారు. ఎన్నికల ప్రచారంలో (Telangana Election 2023) భాగంగా జహీరాబాద్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ఆమె పాల్గొన్నారు.

‘‘ఉద్యోగాల కోసం తెలంగాణ (Telangana) తెచ్చుకుంటే అదీ నెరవేరలేదు. ఉద్యోగ పరీక్షల పేపర్లు లీక్‌ చేసి అవినీతికి పాల్పడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల్లో భారాస (BRS) ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడింది. రూ. 400 గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ. వెయ్యికి పైగా పెంచారు. తెలంగాణలో రైతులు కూడా తీవ్రమైన బాధలో ఉన్నారు. భారాస, భాజపా, ఎంఐఎం సహకరించుకుంటున్నాయి’’ అని ప్రియాంక గాంధీ విమర్శించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z