ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో తానా ఆతిధ్యం కమిటీ చైర్మన్ అక్కినేని ఆనంద్ సమన్వయంలో కానూరు వాసవ్య మహిళా మండలిలోని అనాధ బాలలకు రగ్గులు పంపిణి చేశారు. చిల్డ్రన్ హోమ్ వార్డెన్ స్వరూప రాణి, కాకర్ల గంగాధరరావు, P V S ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వాసవి కన్యకా పరమేశ్వరి కాలనీలో పేదలకు మరియు మున్సిపాలిటీ సిబ్బందికి రగ్గులు అందజేశారు. విశాఖ ఇండస్ట్రీస్ మేనేజర్ సతీష్ బాబు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తానాకు, ఆనంద్‌కు లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు ఆనంద్ చొరవను అభినందించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z