Politics

జగన్ చేతుల మీదగా క్లీనింగ్ యంత్రాలు ప్రారంభం

జగన్ చేతుల మీదగా క్లీనింగ్ యంత్రాలు ప్రారంభం

క్లీనింగ్ యంత్రాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. క్యాంప్ ఆఫీసు వద్ద జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీ నందిగం సురేష్‌, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రేపు నంద్యాల, వైఎస్సార్‌ జిల్లాల్లో సీఎం పర్యటన
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నంద్యాల, వైఎస్సార్‌ జిల్లాల్లో పర్యటించనున్నారు. నంద్యాల జిల్లాలో నిర్మించిన అవుకు రెండో టన్నెల్‌ను సీఎం జగన్‌ జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం కడప పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. ఇందుకోసం గురువారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లికి సీఎం జగన్‌ చేరుకుంటారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z