నాగార్జునసాగర్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఏపీ పోలీసులు అర్ధరాత్రి నాగార్జునసాగర్ వద్దకు చేరుకొని ఎస్పీఎఫ్ పోలీసులపై దాడి చేశారు. డ్యామ్‌పై విద్యుత్ సరఫరా నిలిపివేసి, అక్కడి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. నాగార్జునసాగర్ డ్యామ్ 13వ నంబర్ గేట్ వరకు దూసుకెళ్లారు. విధ్వంసం సృష్టిస్తున్న ఏపీ పోలీసులను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న మీడియా ప్రతినిధులపై పల్నాడు ఎస్పీ రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, మీడియా ప్రతినిధుల ఫోన్లను ఏపీ పోలీసులు లాక్కున్నారు
👉 – Please join our whatsapp channel here –