విజయవాడ నగరంలో దేవాలయాలు, పూల మార్కెట్ల నుంచి నిత్యం టన్నుకు పైగా పూల వ్యర్థాలు పోగవుతున్నాయి. దేవాలయాలు, ఇళ్లలో పూజలు చేసిన పుష్పాలను ఎంతో పవిత్రంగా భావించి చెత్తకుప్పల్లో వేయలేక నదీ జలాల్లో వదిలేయడంతో అవి కాలుష్యం బారిన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ నగరపాలక సంస్థ, గ్రీన్ వేవ్స్ సంస్థ కలిసి వినూత్నంగా ఫ్లవర్ వేస్ట్ ప్రోసెసింగ్ యూనిట్ ప్రారంభించాయి. సేకరించిన పూల వ్యర్థాలను ఎండబెట్టి మెత్తటి పొడిగా తయారు చేసి.. సుగంధ ద్రవ్యాలను కలిపి, అగరబత్తీలు, పూజ ప్రమిదలు తయారు చేస్తున్నారు. ఎకోఫ్రెండ్లీగా తయారు చేసిన ఈ అగర్‌బత్తీలు, ప్రమిదలకు మంచి డిమాండ్ ఉండడంతో ఆన్‌లైన్‌లో అమ్మకాలు చేస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –