Food

మద్యం సీసాలో పురుగు

మద్యం సీసాలో పురుగు

శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి వాల్మీకి కూడలిలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో కొన్న మద్యం సీసాలో పురుగు కనిపించడం కలకలం రేపింది. బుధవారం ఓ వ్యక్తి ఆ దుకాణంలో యంగ్‌ స్టార్‌ బ్రాండ్‌ విస్కీ కొన్నారు. ఇంటికి వెళ్లాక చూస్తే సీసాలో పురుగు కనిపించడంతో వెంటనే దాన్ని దుకాణానికి తీసుకెళ్లి సిబ్బందికి చూపించారు. వారు దానిని తీసుకుని మరో మద్యం సీసా ఇచ్చారు. ‘సరైన తనిఖీలు చేయకుండానే దుకాణాలకు మద్యం ఎలా పంపుతున్నారు?’ అని ఆయన నిలదీశారు. ‘ధరలు పెంచేసి.. ఆపై పురుగులతో కూడిన మద్యం అమ్ముతూ ప్రాణాలతో చెలగాటమాడతారా?’ అని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అబ్కారీ శాఖ ఎస్‌ఐ నారాయణ మాట్లాడుతూ ‘మద్యం సీసాలో ఉన్నది పురుగు కాదు. డస్ట్‌ వచ్చింది. మద్యం నిల్వ ఉండడంతో సిగ్మెంట్‌గా మారింది. ఆ సీసాను పరీక్షలకు పంపించాం. యంగ్‌ స్టార్‌ రకం మద్యాన్ని ఎవరికీ అమ్మకుండా పక్కన పెట్టించాం’ అని వివరించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z