తెలంగాణ పౌరుడిగా తన బాధ్యతను నెరవేర్చానని భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ (KTR) తెలిపారు. తెలంగాణలో (Telangana Elections 2023) ఓటు ఉన్న పౌరులంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో ఓటు వేసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేవాళ్లకే ఓటు వేశానని తెలిపారు.
‘‘ప్రజాస్వామ్యంలో ఇది పెద్ద పండుగ. నగర, పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు పూర్తిస్థాయిలో ఓటింగ్‌కు రావడం లేదు. అందరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి. పట్టణాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. విద్యావంతులంతా తమ బాధ్యతను నిర్వర్తించాలి. నా రాష్ట్రాన్ని ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్లే పార్టీకి ఓటు వేశాను’’ అని కేటీఆర్ చెప్పారు.
👉 – Please join our whatsapp channel here –