Agriculture

నాగార్జునసాగర్ నుంచి నీరు విడుదల

నాగార్జునసాగర్ నుంచి నీరు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాగార్జున సాగర్ నుంచి ఏపీ నీటిని విడుదల చేసింది. సాగర్ ప్రాజెక్ట్ నుంచి కుడి కాలువకు నీటిని విడుదల చేశారు ఏపీ అధికారులు. 2 వేల క్యూసెక్కుల మేరకు పొరుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ కు విడుదల చేశారు. ఒంగోలు చీఫ్ ఇంజినీర్ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ గేట్లను ఎత్తి వేశారు. తెల్లవారు జామున ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. డ్యామ్ గేట్లు, సీసీ కెమెరాలను పొరుగు రాష్ట్రానికి చెందిన పోలీసులు ధ్వంసం చేశారు. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏపీ తెలంగాణ సరిహద్దు దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. నాగార్జున సాగర్, మాచర్ల దారిలో తెలంగాణ నుంచి ఏపీ వైపు వచ్చే వాహనాలను పోలీసులు అనుమతించడం లేదు. ఏపీ అడ్రస్ కలిగిన ఆధార్ కార్డు కలిగి ఉన్న వారిని మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. మిగిలిన వారిని ఏపీ పోలీసులు వెనక్కి తిప్పి పంపిస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z