ScienceAndTech

ఓలా యాప్‌లో కొత్త ఫీచర్‌

ఓలా యాప్‌లో కొత్త ఫీచర్‌

ప్రముఖ క్యాబ్ బుకింగ్‌ సేవల సంస్థ ఓలా (Ola) తన యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ని పరిచయం చేసింది. ఇకపై ఓలా యాప్‌లోనే డిజిటల్‌ పేమెంట్‌ చేయవచ్చని తెలిపింది. ఈ విషయాన్ని ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ (Bhavish Aggarwal) తన అధికారిక ‘ఎక్స్‌’ ఖాతా ద్వారా ప్రకటించారు.సాధారణంగా క్యాబ్‌ బుక్‌ చేసుకోవాలంటే పేమెంట్‌ మోడ్‌లో ఓలా మనీ వాలెట్‌, క్యాష్‌, యూపీఐ లేదా ఇతర పేమెంట్‌ విధానాలు ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఇకపై ఏ ఇతర యూపీఐ యాప్స్‌ సాయం లేకుండా కేవలం ఓలా యాప్‌ ద్వారానే పేమెంట్‌ చేసే సదుపాయాన్ని కంపెనీ కల్పిస్తోంది. ఇప్పటివరకు క్యాబ్‌ బుకింగ్‌కి మాత్రమే వినియోగించే యాప్‌ ఇకపై యూపీఐ సేవల్ని కూడా అందించనుంది. దీనికోసం యాప్‌లో యూపీఐ పేమెంట్స్‌ ఫీచర్‌ని జత చేసింది. దీంతో యాప్‌ ద్వారానే క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేసి డబ్బులు చెల్లించవచ్చని పేర్కొంది. ఈ ఫీచర్‌ మొదట బెంగళూరు వాసులకు అందుబాటులో తీసుకురానుందని కంపెనీ తెలిపింది. ఈ ఏడాది ముగిసే నాటికి దేశవ్యాప్తంగా అన్ని నగరాలకు ఈ సేవల్ని విస్తృతం చేయనున్నట్లు పేర్కొంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z