మహిళల జూనియర్ హాకీ వరల్డ్ కప్‌ను భారత జట్టు భారీ విజయంతో మొదలు పెట్టింది. ఏకపక్షంగా సాగిన తొలి మ్యాచ్‌లో భారత్ 12–0 గోల్స్ తేడాతో కెనడాను చిత్తుగా ఓడించింది. చిలీలోని శాంటియాగోలో జరుగుతున్న ఈ టోర్నీలో మ్యాచ్ అర్ధ భాగం ముగిసే సరికి 4–0తో ముందంజలో నిలిచిన భారత్ తర్వాతి అర్ధ భాగంలో మరో 8 గోల్స్ కొట్టడం విశేషం.
భారత్ తరఫున ముంతాజ్ ఖాన్ ఏకంగా నాలుగు గోల్స్‌తో (26వ నిమిషం, 41వ ని., 54వ ని., 60వ ని.) చెలరేగగా…దీపిక సోరెంగ్ (34వ నిమిషం, 50వ ని., 54వ ని.), అన్ను (4వ నిమిషం, 6వ ని., 39వ ని.) చెరో మూడు గోల్స్ సాధించారు. దీపి మోనికా టోపో (21వ ని.), నీలమ్ (45వ ని.) ఒక్కో గోల్ కొట్టారు. తమ తర్వాతి మ్యాచ్‌లో శుక్రవారం జర్మనీతో భారత్ తలపడుతుంది.
👉 – Please join our whatsapp channel here –