చాలా కాలం తర్వాత రాత్రి కంటి నిండా నిద్రపోయానని భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల్లో అతిశయోక్తులు ఉన్నాయి. (Telangana Elections 2023) అసలైన ఫలితాలు మాకు శుభవార్త చెబుతాయి’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో గురువారం పోలింగ్ ముగిసిన తర్వాత పలు సంస్థలు ఎగ్జిట్ పోల్ అంచనాలను వెల్లడించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌కే మొగ్గు ఉంటుందని మెజారిటీ సంస్థలు చెప్పాయి అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ భారాస 88 సీట్లు వస్తాయని భావించామని.. వేర్వేరు కారణాల వల్ల 70కి పైగా స్థానాల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Zవాస్తవ ఫలితాలు మాకు శుభవార్త చెబుతాయి