చలికాలంలో నచ్చిన వంటకాలు తింటూ శారీరక చురుకుదనం లోపించడంతో త్వరగా బరువు పెరిగే అవకాశం ఉంది. అయితే ఆహారంలో మార్పుల (Weight Loss Diet) ద్వారా వింటర్‌లో మెరుగైన ఆరోగ్యం సొంతం చేసుకోవడంతో పాటు బరువు కూడా తగ్గవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
ఈ సీజన్‌లో అధిక క్యాలరీలతో కూడిన పరాటాలు, పూరీలకు బదులు బరువు నియంత్రణలో ఉండేందుకు మొక్కజొన్న రోటీలను తినడం మేలని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. మొక్కజొన్న రోటీలతో బరువు తగ్గడంతో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. మొక్కజొన్న గ్లూటెన్ రహితం కావడంతో గ్లూటెన్ సరిపడని వారు సైతం నిరభ్యంతరంగా దీన్ని తీసుకోవచ్చు.
ఇక మొక్కజొన్న పిండిలో ప్రొటీన్, క్యాల్షియం, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ సహా పలు విటమిన్లు ఉండటంతో దీన్ని పోషకాల గనిగా చెబుతారు. మొక్కజొన్న రోటీతో చేకూరే ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలిస్తే..
గ్లూటెన్ ఫ్రీ
పోషకాల గని
అధిక ఫైబర్
జీర్ణక్రియ
👉 – Please join our whatsapp channel here –