Business

1.67 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు

1.67 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు

దేశంలో మరోసారి భారీగా జీఎస్టీ వసూళ్లు (GST collections) నమోదయ్యాయి. నవంబర్‌ నెలలో ₹1,67,929 కోట్లు వసూలయ్యాయి. ఇందులో సీజీఎస్టీ వాటా ₹30,420 కోట్లు కాగా.. ఎస్‌జీఎస్టీ వాటా ₹38,226 కోట్లు. ఐజీఎస్టీ రూపంలో ₹87,009 కోట్ల సమకూరగా.. సెస్సుల రూపంలో ₹12,274 కోట్లు వచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.

ఐజీఎస్టీ రూపంలో వచ్చిన వసూళ్లను ₹37,878 కోట్లు సీజీఎస్టీకి, ₹31,557 కోట్లు ఎస్‌జీఎస్టీ కింద సర్దుబాటు చేసింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు 15 శాతం పెరగడం గమనార్హం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది ఆరోసారి. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే.. ₹25,585 కోట్లతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్‌లో ₹4,093 కోట్లు వసూళ్లు జరిగాయి. గతేడాది ₹3,134 కోట్లతో పోలిస్తే 31 శాతం అధికం. తెలంగాణలో గతేడాది ₹4,228 కోట్లు వసూళ్లు జరగ్గా.. ఈ సారి 18 శాతం వృద్ధితో ₹4,986 కోట్లు వసూళ్లు నమోదయ్యాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z