Agriculture

చలి తక్కువే!

చలి తక్కువే!

దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో డిసెంబరు నెలలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కన్నా కాస్త అధికంగానే ఉంటాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉత్తర, వాయవ్య, మధ్య, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో చలి గాలుల తీవ్రత సాధారణ స్థాయి కన్నా తక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర శుక్రవారం వెల్లడించారు. ఫిబ్రవరి వరకు కొనసాగే శీతాకాలంలో దేశవ్యాప్తంగా ఇదే తరహా పరిస్థితి కొనసాగవచ్చని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దీనికి భిన్నమైన పరిస్థితులు ఉండవచ్చని వివరించారు. సగటు వర్షపాతం కూడా సాధారణం కన్నా కాస్త ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z