Politics

ఓట్ల లెక్కింపు రోజున ఆ దుకాణాలకు అనుమతి లేదు

ఓట్ల లెక్కింపు రోజున ఆ దుకాణాలకు అనుమతి లేదు

ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆదివారం కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఆంక్షలు విధిస్తూ శుక్రవారం నగర పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ శాండీల్య ఉత్తర్తులు జారీ చేశారు. 3వ తేదీ ఉదయం 6 నుంచి 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించారు.

నిషేధిత కర్రలు, లాఠీలు, పేలుడు పదార్థాలు, ఆయుధాలతో సంచరించడం నిషేధమని, సంఖ్యలో గుంపులుగా ఐదుగురి కంటే ఎక్కువగా తిరగకూడదని, మైక్‌లు, మ్యూజిక్‌ సిస్టమ్, ప్రసంగాలు చేయడం, నిషేధిత ఫొటోలు, సింబల్స్, ప్లకార్డులు, కులమత ద్వేషాలను రెచ్చగొడుతూ రెండు వర్గాల మధ్య గొడవలు సృష్టించే ప్రసంగాలు చేయడంపై నిషేధా/æ్ఞలు విధించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు, మిలిటరీ, ఎన్నికల అధికారులకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆదివారం మద్యం దుకాణాలను మూసివేయాలని సీపీ ఆదేశాలు జారీ చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z