Fashion

హెన్నాను జుట్టుకు అప్లై చేసేటప్పుడు ఈ నియమాలు పాటించాలి!

హెన్నాను జుట్టుకు అప్లై చేసేటప్పుడు ఈ నియమాలు పాటించాలి!

మెహందీలో ఇవి కలిపితే…

జుట్టుకు మెహందీ పెట్టుకునేటప్పుడు అరటిపండుని కలిపితే కురులకు మరిన్ని పోషకాలు అందుతాయి. అరటిపండులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ మాడు దురదను తగ్గిస్తాయి. అరటిపండుని మెత్తగా చిదుముకుని మెహందీలో వేసి కలపాలి. ఈ మెహందీని జుట్టుకి పట్టించి గంట తరువాత కడిగేయాలి.

కొబ్బరిపాలను కొద్దిగా వేడి చేసి కొన్ని చుక్కలు ఆలివ్‌ ఆయిల్‌ను వేసి కలపాలి. ఈ పాలను మెహందీలో వేసి బాగా కలిపి జుట్టుకు పట్టించాలి. గంట తరువాత షాంపుతో తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేస్తే… కొబ్బరి పాలలోని లారిక్‌ ఆమ్లం మంచి యాంటీబయోటిక్‌గా పనిచేసి, మాడు సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. కండీషనర్స్, షాంపులలో కొబ్బరిపాలను వాడతారు. ఇలా మెహందీలో కొబ్బరిపాలు కలపడం వల్ల మెహందీ మంచి కండీషనర్‌గా పనిచేస్తుంది.

టేబుల్‌ స్పూను హెన్నా, టేబుల్‌ స్పూను ముల్తానీ మట్టిని తీసుకుని నీటిలో నానబెట్టి పేస్టులా చేయాలి. ఈ పేస్టుని తలలో బాగా దురదపెడుతోన్న భాగంలో రాసి, అరగంట తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుముఖం పడుతుంది.

హెన్నా రాసేముందు ఈ తప్పులు చేస్తున్నారా?

మెహందీ అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మారుతుందని అందరూ అనుకుంటారు. కానీ, ఇది ఎలా అప్లై చేయాలి? ఎంత సమయం పెట్టాలో తెలియక చాలామంది తప్పులు చేస్తుంటారు. మెహందీని అప్పటికప్పుడు కలుపుకోకుండాముందు రోజు రాత్రే కనీసం 4-5 గంటల పాటు స్టోర్‌ చేసుకోవాలి.

ఇక హెన్నాను జుట్టుపై ఎంత ఎక్కువసేపు ఉంచితే, అంత బాగా జుట్టు ఆరోగ్యంగా మారుతుందని అందరూ అనుకుంటారు.కానీ, ఇలా ఎక్కువ సేపు ఉంచితే, హెన్నా జుట్టులోని తేమను గ్రహిస్తుంది. జుట్టు విపరీతంగా పొడిగా మారుతుంది. హెన్నా వల్ల స్కాల్ప్ బ్లాక్ అయ్యే సమస్య కూడా ఉంటుంది. కాబట్టి 1-2 గంటలకు మించి పెట్టరాదు.

చాలామంది పొడి జుట్టు మీదే మెహందీని పెడుతుంటారు. ఇలా అస్సలు చేయొద్దు. దీని వల్ల జుట్టు మరింత డ్రైగా కనిపిస్తుంది. రంగు కూడా బాగా కనిపించదు. దీని కోసం, ముందుగా హెయిర్ కండీషనర్‌ని వాడండి, ఆపై మీ జుట్టుకు అప్లై చేయండి. దీనివల్ల జుట్టు పొడిగా మారదు. అలాగే, మెహందీని అప్లై చేసిన తర్వాత మీకు ఎలాంటి సమస్య ఉండదు.

కొంతమందికి హెన్నా పడకపోవచ్చు. కానీ, ఇది జుట్టు రాలడం, అలెర్జీలకు దారితీయవచ్చు. అందువల్ల,జుట్టుకు రాసేముందే కాస్తంత హెన్నాను తీసుకొని చర్మంపై రాసి ప్యాచ్‌ టెస్ట్‌ చేసుకోవాలి.

మెహందీ వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని కొందరు వారం రోజులకు ఒకసారి కూడా పెడుతుంటారు. అలా అస్సలు చేయొద్దు. హెన్నాను నెలకు ఒకసారి మాత్రమే అప్లై చేయాలి. అతిగా వాడొద్దు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z