Politics

చంద్రబాబు రైతులకు ద్రోహిగా మిగిలిపోయారు!

చంద్రబాబు రైతులకు ద్రోహిగా మిగిలిపోయారు!

నీటి పంపకాల విషయంలో రాజీపడే ప్రస్తక్తే లేదని ఎపి మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కృష్ణ జలాల విషయంలో ఎపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. మన హక్కులను కాపాడుకోవడానికి వెళ్తే.. అది దండయాత్ర ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. నాగార్జున సాగర్ డ్యామ్ కుడి కాలువ నుంచి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా ఏపీ ప్రభుత్వం తరలించుకుపోవడంతో వివాదం నెలకొంది. ఈ క్రమంలో డిసెంబర్ 2వ తేదీ శనివారం రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఎక్కువ నీటిని వాడుకుంటుందని.. గతంలో కృష్ణాబోర్డుకు ఇండెంట్ ఇవ్వకుండానే తెలంగాణ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా నీటిని వాడుకుందని ఆరోపించారు. మన నీటిని సాధించుకోవడం కోసం పోలీస్ యాక్షన్ ద్వారా ప్రయత్నిస్తే టీడీపీ విమర్శిస్తుందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో మన నీళ్ల కోసం పోరాడే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.

2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం.. మన రాష్ట్రానికి పట్టిన దుస్థితి అని దుయ్యబట్టారు. ఆయనపై ఉన్న కేసలు కారణంగానే తెలంగాణ ప్రభుత్వానికి చంద్రబాబు లొంగిపోయాడని ఆరోపించారు. రైతల పాలిట ద్రోహిగా చంద్రబాబు మిగిలిపోయారని రాంబాబు అన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z