Movies

అల్లు అర్జున్ అస్వస్థతకు గురయ్యారట

అల్లు అర్జున్ అస్వస్థతకు గురయ్యారట

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) అస్వస్థతకు గురయ్యారట. ఈ కారణంగా పుష్ప2(Pushpa 2) సినిమా షూటింగ్ కు బ్రేక్ పడిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వార్త తెలుసుకున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. గంత కొంతకాలంగా అల్లు అర్జున్ ఎలాంటి విరామం లేకుండా పుష్ప 2 సినిమా కోసం కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే అలసిపోయిన అల్లు అర్జున్ కాస్త ఆస్వస్థతకు లోనయ్యారట. కాస్త నీరసంగా ఉండటంతో రెస్ట్ తీసుకోవాలని సూచించారట డాక్టర్స్. అంతే తప్పా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరంలేదని చెప్పారట. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ ఒప్పిరిపీల్చుకున్నారు.

గత నెలరోజులుగా పుష్ప 2 షూటింగ్ జరుగుతూనే ఉంది. మొన్నటివరకు జాతర ఫైట్ సీక్వెన్స్ తెరకెక్కించిన యూనిట్.. ప్రస్తుతం జాతర సాంగ్ ను తెరకెక్కిస్తున్నారట. ఈ రెండు షెడ్యూల్స్ కోసం నిర్విరమంగా కష్టపడటంతోనే బన్నీ సిక్ అయ్యరట. ఇక పుష్ప2 సినిమా విషయానికి వస్తే.. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ జోడీగా రష్మిక మనదన్నా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. వచ్చే ఎడారి ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. పుష్ప పార్ట్ 1తో బాలీవుడ్ రికార్డ్స్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2తో ఎలాంటి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి మరి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z