DailyDose

ముగిసిన రెండో రౌండ్‌ కౌంటింగ్

ముగిసిన రెండో రౌండ్‌ కౌంటింగ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. తొలి రౌండ్‌ ఫలితాల్లో కాంగ్రెస్‌ మెజారిటీ స్థానాల్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇక రెండో రౌండ్‌లోనూ… కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతున్నట్లు అర్థమవుతోంది. రెండో రౌండ్‌ ఫలితాల్లో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్‌ ముందజంలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ట్‌ పార్టీ స్పష్టమైన మెజారిటీని కనబరుస్తోంది. రెండో రౌండ్‌ పూర్తయ్యేసరికి ఏ స్థానాల్లో ఏ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారో ఇప్పుడు చూద్దాం..

* నల్లగొండలో రెండో రౌండ్‌లో కోమటిరెడ్డి 5407 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

* హజూర్‌ నగర్‌లో 3041 ఓట్లతో ఉత్తమ్‌ ముందజలో ఉన్నారు.

* కొడంగల్‌లో రెండో రౌండ్‌లో రేవంత్‌ రెడ్డి ముందంజలో ఉన్నారు. రెండో రౌండ్‌ పూర్తయ్యే సరికి 2513 ఓట్లతో రేవంత్‌ లీడ్‌లో ఉన్నారు.

* ఇక అశ్వరావుపేటలో 1648 ఓట్లతో కాంగ్రెస్‌ ముందంజలో ఉంది.

* భువనగిరిలోనూ కాంగ్రెస్‌ అభ్యర్థి కుంభం అనిల్‌ రెడ్డి లీడ్‌లో ఉన్నారు.

* జుక్కల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ 178 ఓట్లతో లీడ్‌లో ఉంది.

* ఇల్లందులో రెండో రౌండ్‌ పూర్తయ్యేసరికి కాంగ్రెస్‌ అభ్యర్థి కోరం కనకయ్య 5000 ఓట్లతో ముందంజలో ఉన్నారు.

* పరిగిలో రెండో రౌడ్‌ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి 1866 ఓట్లతో ముందంజలో ఉన్నారు.

* సత్తుపల్లిలో కాంగ్రెస్‌ అభ్యర్థి మట్టా రాగమయి 1147 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.

* ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మల 2వ రౌండ్‌లో 1752 ఓట్లతో లీడ్‌లో కొనసాగుతున్నారు.

* సనత్‌ నగర్‌లో తలసాని శ్రీనివాస్ యాదవ్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

* కరీంనగర్‌లో బండి సంజయ్‌ లీడ్‌లో కొనసాగుతున్నారు.

* హజురాబాద్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి కౌశిక్‌ రెడ్డి ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు.

* ఇక జనగామలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి 1304 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z