తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ట్ పార్టీ లీడ్‌లో కొనసాగుతోంది. దాదాపు 61 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నారు. రౌండ్ రౌండ్ ముగిసేసరికి అభ్యర్థుల మెజారిటీ పెరుగుతోంది. పలు జిల్లాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.
రేవంత్ పోటీ చేస్తున్న కొడంగల్, కామారెడ్డి రెండు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మెజారిటీ దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డికి పోలీసులు భద్రత పెంచారు. ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసులు భద్రత పెంచారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున రేవంత్ ఇంటికి క్యూకడుతోన్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు చేరుకుంటున్నారు. దీంతో ఇప్పుడీ అంశం ఆసక్తిగా మారింది.
ఇదిలా ఉంటే.. ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్‌కు ఎక్కువ స్థానాలు వస్తాయని తెలిసిన తర్వాత రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. శనివారమే పోలీసులు భారీగా రేవంత్ ఇంటికి చేరుకున్నారు. గతంలో కంటే ఎక్కువగా పోలీసులను మోహరించారు. ఇక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రేవంత్ అనుచరులు ఇప్పటికే సంబరాలు ప్రారంభించారు. రేవంత్ ఇంటి వద్ద పెద్ద ఎత్తులో బాణసంచా కాలుస్తూ సందడి చేశారు.
👉 – Please join our whatsapp channel here –