Movies

క్రెడిట్ కార్డ్ ద్వారా ఉచిత సినిమా టిక్కెట్లు

క్రెడిట్ కార్డ్ ద్వారా ఉచిత సినిమా టిక్కెట్లు

మనలో చాలా మందికి సినిమాలంటే ఇష్టం ఉంటుంది. అందులో కొంతమంది రిలీజైన సినిమాలను వదలకుండా థియేటర్స్ లో చూస్తుంటారు. అలా చాలా డబ్బులు ఖర్చు చేస్తుంటారు. ఇక స్టార్ హీరోల సినిమాలకైతే వేళల్లో ఖర్చు చేస్తూ ఉంటారు. అలాంటి వారికోసమే ఈ శుభవార్త. ఇక నుండి పైసా ఖర్చు లేకుండా సినిమాలు చూసేయొచ్చు. అదెలా అనుకుంటున్నారా?

మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందా? ఆ కార్డు ను ఉపయోగించి నెల నెల ఫ్రీ టికెట్స్ పొందొచ్చు. అదెలా అంటే.. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న అన్నీ బ్యాక్ లు క్రెడిట్ కార్డు సౌలభ్యాన్ని అందిస్తున్నాయి. వాటి వాటి నిబంధనల మేరకు కార్డును ఉపయోగించి డేట్ వచ్చాక బిల్ పే చేస్తూ ఉంటారు. కేవలం దానికోసమే కాకుండా.. క్రెడిట్ కార్డు ను రెగ్యులర్ గా వాడుతూనే టికెట్స్ పొందే అవకాశాన్ని ఇస్తోంది కోటక్ మహీంద్రా బ్యాంక్. ఈ బ్యాంకు పీవీఆర్ సంస్థ భాగస్వాయంతో పీవీఆర్ కోటక్ గోల్డ్ క్రెడిట్ కార్డును ప్రెవేశపెట్టింది. ఈ కార్డు వాడటం వల్ల నెలకొక పీవీఆర్ టికెట్ పొడవంచ్చు.

అయితే ఈ కార్డు ద్వారా ఫ్రీ టికెట్ పొందాలంటే మాత్రం నెలలో రూ.10 వేలకు పైగా కార్డు నుండి ఖర్చు చేయాల్సి ఉంటుంది. రూ.15 వేలకు పైగా ఖర్చు చేస్తే రెండు టికెట్స్ పొందవచ్చు. అంతేకాదు. ఐసీఐసీఐ బ్యాంక్ ఎమరాల్డ్ క్రెడిట్ కార్డును ఉపయోగించి కూడా నెలకు నాలుగుసార్లు బై 1 గెట్ 1 మూవీ టికెట్స్ ను పొందవచ్చు. అయితే కేవలం బుక్ మై షో ద్వారా టికెట్ బుక్ చేసుకుంటేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది. మీ దగ్గర ఈ కార్డ్స్ ఉంటే ఎంచక్కా ఫ్రీ టికెట్స్ పొంది సినిమాలు చూసేయండి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z