Politics

జగన్ విశాఖ పర్యటన వాయిదా

జగన్ విశాఖ పర్యటన వాయిదా

పాలనా రాజధానిగా చెబుతున్న విశాఖకు ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన మళ్లీ వాయిదా పడింది. ఇక్కడి నుంచే పాలన సాగిస్తామంటూ.. రుషికొండకు గుండు కొట్టించి రూ.450 కోట్లతో నిర్మించుకున్న అత్యం త ఖరీదైన భవన సముదాయంలోకి ఆయన ఎప్పటికప్పుడు రావాలని యత్నిస్తున్నా ఆ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తోంది. ఉగాది సంబరాలు విశాఖలోనే.. చూస్కోండి జూలైలోనే వచ్చేస్తున్నాం, దసరాకు గ్యారంటీ.. అంటూ రకరకాల ప్రకటనలతో మంత్రులు, వైసీపీ ముఖ్యులు ఎప్పటికప్పుడు ఊదరగొడుతున్నారు. తాజాగా డిసెంబరులో ముహూర్తం ఖరారు చేసినట్లు జగనే ప్రకటించారు. ఈ నెల 8న విశాఖపట్నం వచ్చి నాలుగు రోజులు మకాం వేస్తారని.. వివిధ ప్రభుత్వ శాఖలపై సమీక్ష జరుపుతారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి కూడా. ఇప్పుడు దానికీ ఆటంకాలు వచ్చాయి. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం ఆ పనుల్లో ఉంది. ఈ సమయంలో సీఎం జగన్‌ విశాఖపట్నం వస్తే విమర్శలు వస్తాయని ప్రభుత్వ పెద్దలు ఆందోళన చెందారని.. అందుకే వాయిదా వేశారని ప్రచారం జరుగుతోంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z