Politics

కామారెడ్డిలో రేవంత్‌రెడ్డి హోరాహోరీ పోరు

కామారెడ్డిలో రేవంత్‌రెడ్డి హోరాహోరీ పోరు

తెలంగాణ ఎన్నికల్లో (Telangana Elections 2023) కాంగ్రెస్‌ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఆ పార్టీ ఇప్పటి వరకు 14 స్థానాల్లో జయకేతనం ఎగురవేసి.. 51 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కొడంగల్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, భారాస అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డిపై ఆయన గెలుపొందారు. రేవంత్‌కు 30వేల పైచిలుకు మెజారిటీ వచ్చింది.

మరోవైపు కామారెడ్డిలో హోరాహోరీ పోరు నడుస్తోంది. భారాస అధినేత, సీఎం కేసీఆర్‌.. రేవంత్‌రెడ్డి మధ్య ఆసక్తికర పోటీ జరుగుతోంది. అక్కడ రేవంత్‌ ముందంజలో ఉన్నారు. కామారెడ్డిలో 11 రౌండ్లు ముగిసేసరికి 3,335 ఓట్ల ఆధిక్యంలో ఆయన కొనసాగుతున్నారు.

మరోవైపు హుజూర్‌నగర్‌, అందోల్‌, జుక్కల్‌, నల్గొండలో కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. హుజూర్‌నగర్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గెలుపొందగా.. అందోల్‌లో దామోదర రాజనర్సింహ, జుక్కల్‌లో లక్ష్మీకాంతరావు, నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజయం సాధించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z